Posts

ప్రభుత్వ వ్యవస్థలపై పనిగట్టుకుని దాడి!!

తెలంగాణా రాష్ట్రం కుదురుకుని ఎదుగుతున్న క్రమంలో ఒక ముఠా పనిగట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తోన్న ప్రతిపనిని తప్పుపట్టడం తో పాటు, దానికి వ్యతిరేకంగా అల్లరి మూకలతో కలిసి ఆందోళనలు చేయడం, అక్కడితో ఆగకుండా కోర్టులకు వెళ్లి స్టే లతో పనులను ఆపేయించడం వంటివి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టులు, పథకాలను అడ్డుకోవడానికే పరిమితమైన వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలను కూడా అడ్డుకునేంతగా దిగజారారు. తాజాగా తెలంగాణా రాష్ట్ర  కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలపై హైదరాబాద్ హైకోర్టు లో నమోదయిన కేసు కూడా ఈ కోవలోకే వస్తుంది. గతంలో మల్లన్నసాగర్, కాళేశ్వరం తదితర ప్రోజెక్టుల విషయంలో కేసులు వేసిన వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ నియామకాల ప్రక్రియకు అడ్డు పుల్లలు వేస్తున్నారు.  కాంట్రక్టు అధ్యాపకులను రెగ్యూలరైజ్ చెయ్యడాని వ్యతికేస్తూ కోర్ట్ కు వెళ్లిన వాళ్ళు, సింగరేణి వారసత్వ ఉద్యాగాలను అడ్డుకున్న వాళ్ళు, పోలీసు రిక్రూట్మెంట్ లో అక్రమాలు జరిగాయని అల్లర్లు చేసిన వాళ్ళే ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో కూడా గోల చేయిస్తున్నారు. దీనికోసం ఈ ముఠా మూడంచెల పద్ధతిని ఎంచుకున...

ప్రొ. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం !!

Image
డాక్టర్ రాహుల్ రాజారామ్ తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జాక్) లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రెడ్డి రాజకీయ నాయకత్వ వైఫల్యంపై డా. రాహుల్ రాజారామ్ చేసిన విశ్లేషణ ఇది. ఇందులో కొంతభాగం మార్చ్ 1న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కారణాలు తెలియదుగానీ ఆంధ్రజ్యోతి పూర్తిగా ప్రచురించలేక పోయింది, వ్యాసంలో కీలకమైన అంశాలు ఉన్నందునపూర్తి వ్యాసాన్ని  రచయిత అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం - నీలమేఘం  ప్ర త్యేక తెలంగాణకోసం అకుంఠిత దీక్షతో ఒక దశాబ్ద కాలానికి పైగా రాజీ లేని పోరాటం చేసి నిలబడిన ఉపాధ్యాయుడు, పైగా ఉద్యమ కాలంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె సి ఆర్ కు ఆత్మగా మెలిగిన  ప్రో. కోదండరామ్ తో ప్రభుత్వం వ్యవరించిన తీరు చాలామంది తెలంగాణా వాదులను,ముఖ్యంగా మేధోవర్గాలు, విద్యావంతులను విస్మయానికి గురిచేసింది. శత్రువు కూడా వ్యవహరించని రీతిలో ఆయనను అరెస్ట్ చేయడం  ఆందోళనకు గురిచేసింది. సహజంగానే ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాల...

ఇప్పుడైనా ఆలోచించండి సార్లూ...!

Image

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కోటా కోరాలి ..!

Image
తె లంగాణ ప్రభుత్వం ప్రయివేట్ యూనివర్సిటీల పై వెనక్కు తగ్గినట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. నిజమే అయితే నిజంగానే ఇదొక శుభవార్త. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును అనుమతించాలని ప్రభుత్వం పై ఒత్తిడి ఉంది. గత ఏడాది కాలంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అంతే కాకుండా ముఖేష్ అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు విద్యారంగంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ వ్యాపారానికి తెలంగాణా అనువైన ప్రాంతమని భావించి, హైద్రాబాద్  పరిసరాల్లో కేజీ నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలో కొందరితో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోతెలంగాణా ఉన్నత విద్యాశాఖ ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ముసాయిదాను ఇటీవలి కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి  కూడా అయిన కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఉపసంఘం  ప్రస్తుతం జరుగుతున్...