Posts

Showing posts from December, 2016

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కోటా కోరాలి ..!

Image
తె లంగాణ ప్రభుత్వం ప్రయివేట్ యూనివర్సిటీల పై వెనక్కు తగ్గినట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. నిజమే అయితే నిజంగానే ఇదొక శుభవార్త. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును అనుమతించాలని ప్రభుత్వం పై ఒత్తిడి ఉంది. గత ఏడాది కాలంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అంతే కాకుండా ముఖేష్ అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు విద్యారంగంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ వ్యాపారానికి తెలంగాణా అనువైన ప్రాంతమని భావించి, హైద్రాబాద్  పరిసరాల్లో కేజీ నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలో కొందరితో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోతెలంగాణా ఉన్నత విద్యాశాఖ ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ముసాయిదాను ఇటీవలి కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి  కూడా అయిన కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఉపసంఘం  ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో ఈ బిల్లును ప్

తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం

Image
జర  ఆలోచించుండ్రి సార్!! ప్రొఫెసర్. ఘంటా చక్రపాణి గారు మహబూబ్ నగర్ లో డిసెంబర్ 10 వ తేదీన జరిగిన తెలంగాణా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (TSUTF ) ద్వితీయ మహాసభల్లో చేసిన ఉపాన్యాసం మీద కొందరు అనవసర రాద్ధాంతం చేస్తూ వర్ణాధిక్యతను ప్రదర్శిస్తున్నారు. "విద్యా వ్యవస్థ బాగుపడాలని అడగడానికి వాడెవడు" అని "మేం పోరాడితేనే తెలంగాణా వచ్చింది. మమ్మల్నే పాఠాలు చెప్పమంటావా"? అని ప్రశ్నిస్తున్నారు? ఇదేనా మన సంస్కృతి.? ఇందుకోసమేనా తెలంగాణా సాధించుకుంది. బుద్ధిజీవులు, దళిత బహుజనులు, పేదల పక్షపాతులు తెలంగాణా భావితరాలు బాగుపడాలనుకునే బుద్ధిజీవులు  దయచేసి చదవండి. మంచి మాటను కూడా హర్షించలేని వీళ్ళను ఏమనాలో  ఆలోచించండి.  నిజానికి KG to PG ఉచితవిద్యకోసం ప్రభుత్వ్మ్ ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఎం చేయాలి, పౌరసమాజం ఏంచేయాలి అన్నివిషయాలు ఘంటా చక్రపాణిగారు తన ప్రసంగంలో నిష్కర్షగా చెప్పారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నిర్మొహమాటంగా మాట్లాడినందుకు చక్రపాణి గారిని తప్పుపడదామా, రేపటి పదవులకోసం అల్లరి చేస్తోన్న వాళ్ళను నమ్ముదామా ఆలోచించండి.. ఆతరువాతే, ఆమోదయోగ్యమైతేనే స్పందించండి! నేను ఆ స