Posts

Showing posts from March, 2018

తెలంగాణ దేశానికి మోడల్ కాబోతుందా?

Image
ఏడాది క్రితం కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వ్యక్తం చేసిన సందర్బంగా (2018 మార్చ్ 10 న) డా. రాహుల్ రాజారామ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం పూర్తిపాఠం ఇది. తెలంగాణ దేశానికి మోడల్ కాబోతుందా?  తె లంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరూ ఊహించని రీతిలో జాతీయ రాజకీయాలపై ఒక కొత్త అస్త్రం ప్రయోగించారు. మార్చి మూడో తారీఖున ఆయన పార్లమెంటరీ  పార్టీ మీటింగు పెడుతున్నాడంటే అంతా ఒక రొటీన్ వ్యవహారంగా భావించారు తప్ప ఆయన జాతీయ రాజకీయాల పట్ల అంతటి స్పష్టమైన ప్రకటన చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ప్రకటన, ప్రసంగం, ప్రకంపనలు ఎలావున్నా ఆయన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనా విధానం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.  భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో రాజకీయ సమీకరణాలు జరుగడం కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల ప్రయోగాలుగా మిగిలి పోయాయి. నిజానికి మన దేశంలో రెండో ప్రత్యామ్నాయానికి ముప్పై ఏళ్ళు పట్టింది. మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసిన పార్టీలు అనేకం కనుమరుగైపోగా మిగిలినవి కాంగ్రెస్- బీజీపీల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ ప్రయోగాలు ఆశించిన ఫలిత