తెలంగాణ దేశానికి మోడల్ కాబోతుందా?
ఏడాది క్రితం కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వ్యక్తం చేసిన సందర్బంగా (2018 మార్చ్ 10 న) డా. రాహుల్ రాజారామ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం పూర్తిపాఠం ఇది.
భారత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు
ప్రత్యామ్నాయంగా జనతా పార్టీని చెప్పుకుంటారు. ఇందిరాగాంధీ, కాంగ్రెస్
పార్టీలో అధికార విస్తరణ ఆకాక్ష లేకపోయివుంటే, నియంతృత్వపు పోకడలు
రాకపోయివుంటే జనతా పార్టీ పురుడు పోసుకునేది కాదు. అంటే జనతా పార్టీకూడా ఒక
ప్రజా ప్రత్యామ్నాయంగా (పేరులో జనతా ఉన్నప్పటికీ) రాలేదు. ఇది ఇందిర
వ్యతిరేక కూటమిగా ఏర్పడిందే తప్ప , కొత్త రాజకీయ ఆకాంక్షగా కాదు. జనతా
పార్టీగా ఏర్పడ్డ వారిలో అందరూ నెహ్రూ ను విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు
వచ్చి స్వతంత్ర పార్టీగా ఉన్న సోషలిస్టులు, ఇందిరా గాంధీని వ్యతిరేకించిన
పాత కాంగ్రెస్ నేతలు, అప్పుడప్పుడే పురుడు పోసుకున్నా ఆశించిన ఎదుగుదల
సాధించలేక పోయిన భారతీయ జనసంఘ్ నేతలే తప్ప కొత్తగా వచ్చిన నేతలెవరూ లేరు.
కాకపోతే ఇందిరా హటావో అన్న నినాదం చాలామందిని ఆకర్షించిన మాట నిజం. మొదట
సంపూర్ణ క్రాంతి పేరుతో మొట్టమొదటి సారి దేశంలో కొత్త ఆలోచన తెచ్చిన లోక్
నాయక్ జయప్రకాష్ నారాయణ్ దేశానికి నాయకత్వం వహించడానికి ముందుకు రాకపోవడంతో
అది తిరిగి కాంగ్రెస్ సాంప్రదాయవాద నాయకత్వలోకే వెళ్ళింది. సోషలిస్టు
పార్టీల పేరుతో నాలుగు, కాంగ్రెస్ పేరుతో నాలుగు, భారతీయ జనసంఘ్, లోక్ దళ్
ఇట్లా పదకొండు పార్టీల జనతా ప్రయోగం అతుకులబొంతగా మారి అటకెక్కింది. అయితే
ఇదే దేశంలో రెండో ప్రధాన పక్షంగా భారతీయ జనతా పార్టీ పుట్టుకకు ప్రాణం
పోసింది.

అంతే కాదు ఈ విఫల ప్రయోగం అనేకమంది విజయవంతమైన నేతలను దేశానికి
అందించింది. వీరిలో చాలామంది స్వీయ అస్తిత్వం, చైతన్యం, సిద్ధాంత నిబద్ధత
కలిగిన వారే అయినప్పటికీ ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో లేదా కులానికో,
వర్గానికో పరిమితమై పోయారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్,
రాంవిలాస్ పాశ్వాన్ ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్, ఒరిస్సాలో నవీన్
పట్నాయక్ వంటి వంటివారు జనతా పరివారం నుంచి వచ్చిన వారే. ఆ తరువాత మరో
పదేళ్ళపాటు ఇందిరా, రాజీవ్ గాంధీల పాలన అవినీతి ఊబిలో కూరుకు పోయి,
బోఫోర్స్ వ్యవహారం తరువాత స్వయంగా అదేపార్టీకి చెందిన వీపీ సింగ్
నాయకత్వంలో కాంగ్రెస్ చీలికకు కారణమయ్యింది.
ఇది దేశంలో1988 లో మొట్టమొదటి తృతీయ ఫ్రంట్ ఆలోచనకు బీజాలు వేసింది.
ఇందులో కీలక పాత్ర పోషించింది జనతా పార్టీ తయారు చేసిన నాయకులు రూపకల్పన చేసిన జనతాదళ్ అయినప్పటికీ తెలుగుదేశం, అస్సాం గణపరిషత్ సహా అప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో ఏర్పడ్డ మూడో ప్రత్యామ్నాయ కూటమికి వెన్నెముకగా నిలిచాయి. వీటికి వామపక్షాల మద్దత్తుకూడా కీలకంగా మారింది. ఆ తరువాత పలు దఫాలుగా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని జరిగినా అవన్నీ ఎన్నికల కోసమో, అధికారంకోసమో తప్ప ప్రజలకోసం ఒకింత కొత్త రాజకీయ వేదికలుగా మిగలలేక పోయాయి. ఈ వేదికలేవయినా అటు కాంగ్రెస్ పార్టీ కో ఇటు బీజేపీ కో తోకలుగా మిగిలాయి తప్ప దేశ రాజ్యాంగపు మౌలిక స్వరూప స్వభావాలను ఆచరించలేకపోయాయి, దాని ముసుగులో సాగుతోన్న మూస ఆలోచనను మార్చలేకపోయాయి. ఈ అంశాలనే ఇప్పుడు కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఆయన కేవలం గతకాలపు ప్రాంతీయ పార్టీల మాదిరిగా గవర్నర్ల వ్యవస్థ మీదో, ఢిల్లీ పెత్తనం మీదనో అక్కసు వెళ్లగక్కడంలేదు. ఇప్పటికిప్పుడు ఆయన సిద్ధాంతమేమిటో తెలియకపోయినా ఆయన లేవనెత్తుతున్న అంశాలు మాత్రం ఇంతకాలం సాగిన రాజకీయ సాముగరిడీలను ఎండగట్టే రీతిలో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఆయన ఇప్పుడు ఒక ఏ ఆర్ దేశాయ్, రాజనీకొఠారీ లాంటి సామాజిక శాస్త్రవేత్ లు లేవనెత్తిన కాల్పనిక జాతీయవాద ధోరణిని, ఆధిపత్య మత, కుల రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగం సూచించిన సమాఖ్య భావనను కోరుకుంటున్నారు. అందుకే తనది ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు.
కేసీఆర్ లేవనెత్తుతున్న చర్చ ప్రాధమికంగా జనతా పార్టీ, జనతాదళ్ ల వైఫల్యాలు, విస్మరించిన అజెండాలా నుంచి వచ్చినట్టుగా కనిపిస్తోంది. జనతా పార్టీ హయాంలో రైతులు, వ్యవసాయం గురించిన ప్రస్తావన చౌదరి చరణసింగ్, దేవి లాల్ లాంటి నేతలు రైతు ప్రతినిధులు గా చేసినా అది మౌలిక అంశాల ప్రస్తావన లేకపోవడంతో ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు కేసీఆర్ వాటినే ప్రస్తావిస్తున్నారు. పెద్దరైతులు భూస్వాముల గురించి కాకుండా ఆయన మొత్తం వ్యవసాయం ఒక ప్రధాన ఉత్పాదక రంగంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడి, గిట్టుబాటు ధరతో పాటు ఆయన సాగుకు అవసరమైన నీటి గురించి నదీజలాల వినియోగం గురించి చెపుతున్నారు. నదీ జలాల సమస్య పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునల్ ల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను రాజకీయాలు గడిచిన డెబ్భై ఏళ్లలో ఎంత నిర్లక్ష్యం చేశాయో చెప్పబోతున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తోన్న రెండో విషయం కూడా రెండో జనతా కూటమి లేదా మొదటి తృతీయ ప్రత్యామ్నాయం అయినా జనతాదళ్ వదిలేసిన సామాజిక న్యాయం. ఆయన జనతాదళ్ మాదిరిగా వెనుకబడిన వర్గాల రేజర్వేషన్ల గురించి ప్రస్తావించి వదిలేస్తే అందులో విశేషం ఏమీలేదు. కానీ ఆయన రేజర్వేషన్ల నిర్ణయం మీద అధికారం రాష్ట్రాలకు ఉండాలంటున్నారు. ఇదొక విప్లవాత్మక వాదన. ఇప్పటివరకు వెనుకబడిన తరగతులకు ఆశాజ్యోతులు గా వెలుగొందిన మండల్, వీపీ సింగ్ మొదలు ఆ వర్గాలకు ఛాంపియన్లుగా పేరు తెచ్చుకున్న ములాయం, లాలూ ప్రసాద్ యాదవులు కూడా చేయని ఆలోచన. దేశంలో ఇంతకాలం నిర్లక్షానికి గురైన ప్రధాన సామాజిక పక్షాల వైపునుంచి ఆయన ఈ బలమైన వాదాన్ని ముందుకు తేనున్నారు. అంతేస్థాయిలో ఆయన మౌలికమైన సామాజిక అంశాలను, పౌర సేవలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, గ్రామీణ, నగర పాలనను ప్రస్తావిస్తున్నారు. నిజానికి సంస్కరణల తరువాత రూపుదిద్దుకుంటున్న సమాజానికి విద్య, వైద్యం రెండూ సామాన్యులకు కీలకంగా మారిపోయాయి. ఇప్పుడు దేశంలోమధ్యతరగతి మూడొంతుల సంపాదన పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఖర్చయిపోతోంది. ఇక దిగువ తరగతికి ఆరోగ్య పథకాలే దిక్కవుతున్నాయి.
ఇటువంటి తరుణంలో తెలంగాణలో గురుకులాలు సాధిస్తోన్న విజయాలు దేశానికే ఒక నమూనాగా నిలుపవచ్చని, కేజీ టూ పీజీ నినాదం ముందుకు తీసుకెళ్లవచ్చని కేసీఆర్ భావించవచ్చు. అలాగే గడిచిన ఏడాది కాలంగా తెలంగాణా ఆరోగ్య రంగంలో అనూహ్యమైన విజయాలు సాధించింది. డయాలసిస్ కేంద్రాలు, కేసీఆర్ కిట్లు, తల్లీ బిడ్డలా సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే మంచినీటి కోసం మైళ్లకొద్దీ నడిచే పరిస్థితి దేశం అంతటా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలూ లేవనెత్తడం కీలకం కాబోతోంది. కేవలం ఇవి లేవనెత్తడంతోనే ఆయన ఆగిపోతాడనుకోలేం. ఆయన తెలంగాణా లో గడిచిన నాలుగేళ్లలో సాధించిన విజయాలను ఒక నమూనాగా చూపించ బోతున్నారు. ఇంటింటికి కుళాయిలో నీళ్లు వస్తాయంటే ఎవరూ నమ్మకపోవచ్చు, కానీ వచ్చే ఆరునెలల్లో అది తెలంగాణలో నిజం కాబోతుంది. ఇక సాగునీటిని పాతాళంలో ఉన్నా పట్టుకు రావచ్చోని, ఎడారిలో సైతం నీళ్లు పారించవచ్చని నిరూపించబోతున్నారు. దశాబ్దాలుగా మాటల్లో నలుగుతున్న జాతీయస్థాయి నదుల అనుసంధానాన్నినిజం చేస్తానని చెప్పవచ్చు. దళితులు, మహిళలు, మైనారిటీలకు తెలంగాణలో అమలు చేస్తోన్న ప్రణాళికలను జాతీయ స్థాయిలో ప్రచారం చేయవచ్చు. ఇప్పటికిప్పుడు అజెండా ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అనే విషయాల్లోకి వెళ్లడం తొందరపాటు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆయన చెపుతున్న విషయాలు మాత్రం ఆసక్తి కరంగానే ఉన్నాయి.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు ఎవరూ ఊహించని రీతిలో జాతీయ రాజకీయాలపై ఒక కొత్త అస్త్రం ప్రయోగించారు.
మార్చి మూడో తారీఖున ఆయన పార్లమెంటరీ పార్టీ మీటింగు పెడుతున్నాడంటే అంతా
ఒక రొటీన్ వ్యవహారంగా భావించారు తప్ప ఆయన జాతీయ రాజకీయాల పట్ల అంతటి
స్పష్టమైన ప్రకటన చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ప్రకటన, ప్రసంగం, ప్రకంపనలు
ఎలావున్నా ఆయన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనా విధానం రాజకీయ పండితులను
సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో
రాజకీయ సమీకరణాలు జరుగడం కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల
ప్రయోగాలుగా మిగిలి పోయాయి. నిజానికి మన దేశంలో రెండో ప్రత్యామ్నాయానికి
ముప్పై ఏళ్ళు పట్టింది. మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసిన పార్టీలు
అనేకం కనుమరుగైపోగా మిగిలినవి కాంగ్రెస్- బీజీపీల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ
ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం రాజకీయాలు తప్ప
వీటికి రాజ్యాంగ అజెండా ఏదీ లేకపోవడం. కానీ కేసీఆర్ తనదైన శైలిలో భారత
రాజకీయాలకు ఒక కొత్త అజెండాను తెరమీదికి తెచ్చాడు కాబట్టి దీనిని మిగితా
వేదికల్లా తీసిపారేయలేము. నిజానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి భారత
రాజకీయాలు అత్యంత మూస ధోరణిలో సాగుతున్నాయి. నిజానికి జవహార్ లాల్ నెహ్రు
నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి 1964 దాకా
స్వాతంత్రం తెచ్చిన పార్టీగా చెప్పుకుంటూ జాతీయ ప్రయోజనాలు, జాతి
పునర్నిర్మాణం పేరుతో ప్రజలకు రెండో ఆలోచన కూడా రాకుండా జాగ్రత్తపడింది.
రాజకీయంగా జాతీయవాదం వైపు, ఆర్ధిక విధానాల విషయంలో సామ్యవాదం వైపు
మొగ్గుచూపిన నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన రాజకీయ దృక్పధాన్ని,
భారత దేశం పట్ల, ముఖ్యంగా అసమానతలతో ఉన్న సమాజం పట్ల ఒక దృష్టికోణాన్ని
ఇవ్వకుండానే తన శకం ముగించారు.అయితే ఆయన అప్పటి రాజకీయ సిద్ధాంతాలైన
సోషలిజం, కమ్యూనిజం నినాదాలను కూడా వినబడనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ
తరువాత ఆయన వారసురాలిగా వచ్చిన ఇందిరాగాంధీ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో,
ఆర్ధిక విధానాలలో అదే మూస ధోరణిలో ప్రయాణించింది. దీంతో కాంగ్రెస్
పార్టీలో అసహనం, అసమ్మతి పెరిగిపోయింది, పార్టీ చీలికలు పేలికలయ్యింది. ఇదే
తరుణంలో ఆమె కొన్ని అసాధారణ నిర్ణయాలతో 1971 ఎన్నికలకు ముందు ఆ తరువాత
రాజకీయాల్లో తొలి ప్రకంపనలకు కారణమయ్యారు, బ్యాంకుల జాతీయీకరణ తో మొదలై
గరీబీ హటావో నినాదంతో ఒక రకంగా మొదటిసారి దేశ రాజకీయాలను భూమార్గం
పట్టించారు. 20 సూత్రాల పథకం వంటి కార్యక్రమాలతో ఆమె గ్రామీణ, వ్యవసాయ
సమాజపు స్వరూపాన్ని మార్చే ప్రతిపాదనలు చేశారు.
బహుశా అదేకాలంలో
రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ కు ఆమె ప్రతిపాదనలు ఆ కాలంలో నచ్చి ఉంటాయి.
నిజానికి అభివృద్ధి కొత్త దిశలోకి రావడంతో పాటు రాష్ట్రాల అస్తిత్వ
చైతన్యం అంకురించింది కూడా ఇందిరాగాంధీ కాలంలోనే. అప్పుడే ఫెడరలిజం పైన
మొదటి సారిగా అకడమిక్ చర్చ ప్రారంభమయ్యింది. భాషా ప్రయుక్త రాష్టాలు
అప్పటికే ఏర్పడ్డా, ప్రాంతీయ వాదం బలపడింది. అప్పటికి 15 మాత్రమే ఉన్న
రాష్ట్రాల సంఖ్య ఇందిరాగాంధీ హయాంలో 22కి చేరింది. పంజాబ్, హర్యానా,
హిమాచల్ తో పాటు ఈశాన్య భారతంలో కొత్త హక్కుల కోసం మొదలైన ఉద్యమాలు కొత్త
రాష్ట్రాల ఏర్పాటుకు కారణం అయ్యింది. అయితే ఇందిరాగాంధీ చేసిన రాష్ట్రాల
విభజన కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగపడిందని, అది ఆ
పార్టీ విస్తరణకు మాత్రమే దోహద పడిందే తప్ప ఆయా రాష్ట్రాలు ఆశించిన
ప్రయోజనాలను, హక్కులను దక్కించలేక పోయిందనే విమర్శలూ ఉన్నాయి.
కానీ ఎమర్జెన్సీ
(1975-77)
నాటి అరాచకాల వల్ల ఆమె చేసిన, చేయాలనుకున్న మంచిపనులు కూడా లెక్కలోకి రాకుండా పోయాయి
ఎమర్జెన్సీ నాటికి ఆమె స్వతంత్ర భారతదేశానికి ఒక నియంతలా
మారిపోయారు. అప్పటికి 30 సంవత్సరాల పాటు దేశంలో రెండో ప్రత్యామ్నాయం కూడా లేని స్థితి.

ఇది దేశంలో1988 లో మొట్టమొదటి తృతీయ ఫ్రంట్ ఆలోచనకు బీజాలు వేసింది.
ఇందులో కీలక పాత్ర పోషించింది జనతా పార్టీ తయారు చేసిన నాయకులు రూపకల్పన చేసిన జనతాదళ్ అయినప్పటికీ తెలుగుదేశం, అస్సాం గణపరిషత్ సహా అప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో ఏర్పడ్డ మూడో ప్రత్యామ్నాయ కూటమికి వెన్నెముకగా నిలిచాయి. వీటికి వామపక్షాల మద్దత్తుకూడా కీలకంగా మారింది. ఆ తరువాత పలు దఫాలుగా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని జరిగినా అవన్నీ ఎన్నికల కోసమో, అధికారంకోసమో తప్ప ప్రజలకోసం ఒకింత కొత్త రాజకీయ వేదికలుగా మిగలలేక పోయాయి. ఈ వేదికలేవయినా అటు కాంగ్రెస్ పార్టీ కో ఇటు బీజేపీ కో తోకలుగా మిగిలాయి తప్ప దేశ రాజ్యాంగపు మౌలిక స్వరూప స్వభావాలను ఆచరించలేకపోయాయి, దాని ముసుగులో సాగుతోన్న మూస ఆలోచనను మార్చలేకపోయాయి. ఈ అంశాలనే ఇప్పుడు కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఆయన కేవలం గతకాలపు ప్రాంతీయ పార్టీల మాదిరిగా గవర్నర్ల వ్యవస్థ మీదో, ఢిల్లీ పెత్తనం మీదనో అక్కసు వెళ్లగక్కడంలేదు. ఇప్పటికిప్పుడు ఆయన సిద్ధాంతమేమిటో తెలియకపోయినా ఆయన లేవనెత్తుతున్న అంశాలు మాత్రం ఇంతకాలం సాగిన రాజకీయ సాముగరిడీలను ఎండగట్టే రీతిలో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఆయన ఇప్పుడు ఒక ఏ ఆర్ దేశాయ్, రాజనీకొఠారీ లాంటి సామాజిక శాస్త్రవేత్ లు లేవనెత్తిన కాల్పనిక జాతీయవాద ధోరణిని, ఆధిపత్య మత, కుల రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగం సూచించిన సమాఖ్య భావనను కోరుకుంటున్నారు. అందుకే తనది ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు.
కేసీఆర్ లేవనెత్తుతున్న చర్చ ప్రాధమికంగా జనతా పార్టీ, జనతాదళ్ ల వైఫల్యాలు, విస్మరించిన అజెండాలా నుంచి వచ్చినట్టుగా కనిపిస్తోంది. జనతా పార్టీ హయాంలో రైతులు, వ్యవసాయం గురించిన ప్రస్తావన చౌదరి చరణసింగ్, దేవి లాల్ లాంటి నేతలు రైతు ప్రతినిధులు గా చేసినా అది మౌలిక అంశాల ప్రస్తావన లేకపోవడంతో ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు కేసీఆర్ వాటినే ప్రస్తావిస్తున్నారు. పెద్దరైతులు భూస్వాముల గురించి కాకుండా ఆయన మొత్తం వ్యవసాయం ఒక ప్రధాన ఉత్పాదక రంగంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడి, గిట్టుబాటు ధరతో పాటు ఆయన సాగుకు అవసరమైన నీటి గురించి నదీజలాల వినియోగం గురించి చెపుతున్నారు. నదీ జలాల సమస్య పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునల్ ల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను రాజకీయాలు గడిచిన డెబ్భై ఏళ్లలో ఎంత నిర్లక్ష్యం చేశాయో చెప్పబోతున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తోన్న రెండో విషయం కూడా రెండో జనతా కూటమి లేదా మొదటి తృతీయ ప్రత్యామ్నాయం అయినా జనతాదళ్ వదిలేసిన సామాజిక న్యాయం. ఆయన జనతాదళ్ మాదిరిగా వెనుకబడిన వర్గాల రేజర్వేషన్ల గురించి ప్రస్తావించి వదిలేస్తే అందులో విశేషం ఏమీలేదు. కానీ ఆయన రేజర్వేషన్ల నిర్ణయం మీద అధికారం రాష్ట్రాలకు ఉండాలంటున్నారు. ఇదొక విప్లవాత్మక వాదన. ఇప్పటివరకు వెనుకబడిన తరగతులకు ఆశాజ్యోతులు గా వెలుగొందిన మండల్, వీపీ సింగ్ మొదలు ఆ వర్గాలకు ఛాంపియన్లుగా పేరు తెచ్చుకున్న ములాయం, లాలూ ప్రసాద్ యాదవులు కూడా చేయని ఆలోచన. దేశంలో ఇంతకాలం నిర్లక్షానికి గురైన ప్రధాన సామాజిక పక్షాల వైపునుంచి ఆయన ఈ బలమైన వాదాన్ని ముందుకు తేనున్నారు. అంతేస్థాయిలో ఆయన మౌలికమైన సామాజిక అంశాలను, పౌర సేవలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, గ్రామీణ, నగర పాలనను ప్రస్తావిస్తున్నారు. నిజానికి సంస్కరణల తరువాత రూపుదిద్దుకుంటున్న సమాజానికి విద్య, వైద్యం రెండూ సామాన్యులకు కీలకంగా మారిపోయాయి. ఇప్పుడు దేశంలోమధ్యతరగతి మూడొంతుల సంపాదన పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఖర్చయిపోతోంది. ఇక దిగువ తరగతికి ఆరోగ్య పథకాలే దిక్కవుతున్నాయి.
ఇటువంటి తరుణంలో తెలంగాణలో గురుకులాలు సాధిస్తోన్న విజయాలు దేశానికే ఒక నమూనాగా నిలుపవచ్చని, కేజీ టూ పీజీ నినాదం ముందుకు తీసుకెళ్లవచ్చని కేసీఆర్ భావించవచ్చు. అలాగే గడిచిన ఏడాది కాలంగా తెలంగాణా ఆరోగ్య రంగంలో అనూహ్యమైన విజయాలు సాధించింది. డయాలసిస్ కేంద్రాలు, కేసీఆర్ కిట్లు, తల్లీ బిడ్డలా సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే మంచినీటి కోసం మైళ్లకొద్దీ నడిచే పరిస్థితి దేశం అంతటా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలూ లేవనెత్తడం కీలకం కాబోతోంది. కేవలం ఇవి లేవనెత్తడంతోనే ఆయన ఆగిపోతాడనుకోలేం. ఆయన తెలంగాణా లో గడిచిన నాలుగేళ్లలో సాధించిన విజయాలను ఒక నమూనాగా చూపించ బోతున్నారు. ఇంటింటికి కుళాయిలో నీళ్లు వస్తాయంటే ఎవరూ నమ్మకపోవచ్చు, కానీ వచ్చే ఆరునెలల్లో అది తెలంగాణలో నిజం కాబోతుంది. ఇక సాగునీటిని పాతాళంలో ఉన్నా పట్టుకు రావచ్చోని, ఎడారిలో సైతం నీళ్లు పారించవచ్చని నిరూపించబోతున్నారు. దశాబ్దాలుగా మాటల్లో నలుగుతున్న జాతీయస్థాయి నదుల అనుసంధానాన్నినిజం చేస్తానని చెప్పవచ్చు. దళితులు, మహిళలు, మైనారిటీలకు తెలంగాణలో అమలు చేస్తోన్న ప్రణాళికలను జాతీయ స్థాయిలో ప్రచారం చేయవచ్చు. ఇప్పటికిప్పుడు అజెండా ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అనే విషయాల్లోకి వెళ్లడం తొందరపాటు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆయన చెపుతున్న విషయాలు మాత్రం ఆసక్తి కరంగానే ఉన్నాయి.
కేసీఆర్
చెపుతున్నట్టు ఈ దేశంలో పాలకవర్గాలు ప్రజలను పావులుగా వాడుకున్నారు.
మూసరాజకీయాలు నడిపించారు. మూస పద్ధతులు మూలలను మార్చలేవని డా. బి. ఆర్.
ఆనాడే
అంబెడ్కర్
చెప్పారు. ప్రభుత్వం మౌలికంగా ప్రజల జీవితాలను మార్చేదిగా ఉండాలని
అంబెడ్కర్ కేంద్ర మంత్రిగా చేసిన సూచనలను అప్పటి పాలకులు, కాంగ్రెస్ పార్టీ
పెడచెవిన పెట్టాయి. ముఖ్యంగా జాతీయత, ఆర్ధిక విధానాలు, నదీజలాలు,
వ్యవసాయం, ముస్లిం మైనారిటీలు, వెనుకబడిన వర్గాల రేజర్వేషన్ల విషయంలో
అంబెడ్కర్ ఆలోచనలను తొక్కిపెట్టారు. చివరకు మహిళలకు సమాన హోదా, గుర్తింపు,
గౌరవం, ఆర్ధిక స్వావలంబన కోసం ఆయన ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్లును
నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడమే కాకుండా అంబేద్కర్ ను పార్లమెంటరీ
రాజకీయాల నుంచి వైదొలగేలా చేశారు. ఆ తరువాత మళ్ళీ ఎవరూ వాటి ప్రస్తావన
మాటవరసకైనా ఎన్నికల అజెండాలోకి, పార్లమెంటరీ వ్యవస్థలోకి తేలేదు. ఇప్పుడు
కేసీఆర్ చెపుతున్న మాటల్లో మొదటిసారిగా వాటి ప్రస్తావన వినబడుతోంది. ఆయన తన
మాటమీద నిలబడతారా? ఎంతమంది దీనిని నమ్ముతారు? ఎవరెవరు ఆయన వెంట నడుస్తారు?
మునుముందు ఏం
ఏంజరగబోతోంది? అన్న ప్రశ్నలకు దొరకాల్సిన సమాధానాలకోసం వేచి
చూడాల్సిందే!
డా. రాహుల్ రాజారామ్
Comments
Post a Comment