ఫెడరల్ ఫ్రంట్: చెప్పాల్సింది ఇంకా ఉంది!

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ NDTV ప్రతినిధి ప్రణయ్ రాయ్, ThePrint ప్రతినిధి శేఖర్ గుప్తా తో మాట్లాడిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో తదనంతర చర్చ పై ఢిల్లీలో ఉంటున్న సామాజిక పరిశోధకుడు, రాజకీయ విశ్లేషకుడు డా. రాహుల్ రాజారామ్ రాసిన ఈ వ్యాసం ఏప్రిల్ 6 నమస్తే తెలంగాణ పత్రికలో అచ్చయ్యింది. ఆలోచింపజేసే విధంగా ఉన్న విశ్లేషణ ఇక్కడ ప్రచురిస్తున్నాం. -నీలమేఘం

ఫెడరల్ ఫ్రంట్: చెప్పాల్సింది ఇంకా ఉంది!

డా. రాహుల్ రాజారామ్ 


కదంపుడు మాటలు తప్ప ఫెడరల్ ఫ్రంట్ ఊసేలేదని ఎగతాళి చేసిన వారికి తెలంగాణా రాష్ట్ర సమితి  అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దిమ్మదిరిగే సమాధానం చెప్పబోతున్నాడా!? ఔననే అనిపిస్తోంది. ఇటీవలి ఆయన ప్రసంగాలు, ప్రస్తావిస్తోన్న అంశాలు రాజకీయం పరిశీలకుల్లో ఆసక్తిని రేకేస్తోంది. ముఖ్యంగా ఆయన ఇటీవల దేశంలోని ప్రముఖ పాత్రికేయులు ప్రణయ్ రాయ్, శేఖర్ గుప్తా లకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తరువాత దేశ రాజకీయాలను నిశితంగా గమనిస్తోన్న వారికి ఒక కొత్త విశ్వాసం కలుగుతోందిముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలతో విసిగిపోయి ఉన్నవారికి కేసీఆర్ ఇప్పుడొక సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. కేసీఆర్ ను ప్రాంతాలు, జాతులు, కులాలు మతాలకు అతీతంగా ప్రజలు ముఖ్యంగా చదువరులు నెటిజన్లు స్వాగతిస్తున్నారనడానికి ఆయన ఇంటర్వ్యూ వైరల్ కావడమే ఒక నిదర్శనం. కేసీఆర్ ఇంటర్వ్యూ ను ఎన్డీటీవీ ఛానెల్ ఈనెల 3 తేదీ ప్రసారం చేసి అదే రోజు రాత్రి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.  
 Prannoy Roy Speaks To KCR On Role Of Regional Parties: Highlights

ఇప్పుడది పేస్ బుక్, ట్విట్టర్ యూట్యూబేలో సంచలనమై కూర్చుంది. ఇప్పటికే లక్షలాదిమంది దాన్ని చూసారు. వేలాది మంది షేర్ చేసుకున్నారు. భారతీయ జర్నలిజాన్ని కొత్త మలుపు తిప్పిన ఇద్దరు ఉద్ధండులు ప్రణయ్ రాయ్ (దేశంలో తొలి తెంగ్లీష్ వార్తా ఛానెల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకులు) శేఖర్ గుప్తా ( సుదీర్ఘ కాలం ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ ను నడిపించిన సంచలన సంపాదకులు, ప్రస్తుతం ది ప్రింట్ పేరుతో ఇంగ్లీష్ లో న్యూస్ వెబ్ సైట్ నిర్వాహక సంపాదకులు) వారితో పాటు తెలంగాణలో చాలాకాలంగా పనిచేస్తూ కేసీఆర్ లోతుపాతులు తెలిసిన ఉమాశ్రీధర్ వంటి సుదీర్ఘ అనుభవం కలిగిన జర్నలిస్టులు వేస్తోన్న ప్రశ్నలకు నిశ్చలంగా, నిర్మలంగా, నిబ్బరంగా ఆయన మాట్లాడిన తీరు చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఇంటర్వ్యూని ప్రసారం చేసినందుకు, కేసీఆర్ వంటి నాయకుడు దేశంలో ఒకరున్నారని పరిచయం చేసినందుకు ఎన్డీటీవీకి కృతజ్ఞతలు చెపుతున్నారు. భారత దేశంలో రాజకీయాలంటేనే సాధారణంగా తరం వ్యక్తులు, ముఖ్యంగా నెటిజన్లు  విముఖతతో ఉంటారు, వాటికి దూరంగా కూడా ఉంటారు. కానీ ఇప్పటి వరకు కెసిఆర్ ఇంటర్వ్యూని సగటున మొదటి రెండు రోజుల్లో గంటకు పదమూడు వందలమందికి పైగా ఒక్క యూట్యూబ్ లోనే చూసారు. ఇప్పుడున్నరాజకీయ వాతావరణంలో నెటిజన్లకు ఒక కొత్త ప్రాంతీయ నాయకుడి పట్ల ఇటువంటి గౌరవభావం వ్యక్తం చేయడం అరుదు, అంతే కాదు అసాధారణం కూడా.
 View image on Twitter

దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తోన్న మా బృందం కేవలం 36 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఇంటర్వ్యూ ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో పరిశీలించాలని భావించింది. వీడియోను ఎవరు షేర్ చేశారు, ఎవరు చూసారు, వీక్షకులు ఎవరు, వారి ప్రతిస్పందన ఏమిటి,ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు అనే విషయాల మీద దృష్టి  పెట్టింది. సహజంగానే ఎక్కువమంది యువత దీనిని షేర్ చేసుకుంది, వారిలో ప్రైవేటు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారితో పాటు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులుకూడా ఉన్నారు. తెలంగాణా తో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన  బీహార్యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు ఢిల్లీ,  మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ వారున్నారు. బెంగాలీ, ఒరియా, పంజాబీ పేర్లు కూడా కనిపించాయి. ఇట్లా మొత్తంగా భారత దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు భాషలనుంచి వీడియోను చూసారు. కొందరుం కేసీ ఆర్ ఇంటర్వ్యూ మొదటి సారి అని కూడా తమ కామెంట్ల లో రాశారు. ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదని పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా దాదాపు అందరూ ఇలాంటి వ్యక్తి ఈదేశానికి అవసరం అన, ఆయన ప్రధాని పదవికి అన్ని రకాలుగా అర్హులని రాశారు. గమనించ వలసిన విషయం ఏమిటంటే ఇందులో ఎక్కువమంది ముస్లింలు కూడా ఉన్నారు. వారు ఏకగ్రీవంగా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇక తెలంగాణా వారే కాదు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వీక్షకులు కేసీఆర్ ను  ఎత్తేస్తున్నారు, మా తెలుగు బిడ్డ అని సగర్వంగా చెప్పుకుంటున్నారు. కొందరు  చంద్రబాబును తిట్టిపోస్తుంటే ఇంకొందరు కేసీఆర్ వెంట నడవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని వేడుకుంటున్నారు.

కేసీఆర్ ను ఎందుకు ఇష్ట పడుతున్నారు?

కేవలం అరగంట ఇంటర్వ్యూ చూసి ఇంతమంది కేసీఆర్ ను ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నది కొంత ఆలోచించవలసిన అంశం. దేశంలో ఇప్పుడు ఇంటర్నెట్, యూట్యూబ్ అనేవి సాధారణ ప్రసార మాధ్యమాలయి పోయాయి. దేశంలో దాదాపు 50 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు, అందులో దాదాపు 25 కోట్ల మంది యూట్యూబ్ చూస్తుంటారు. దేశంలో దాదాపు 80 శాతం మంది యూట్యూబేలో వార్తలు చూస్తుంటారని ఇటీవలే ఒక సర్వే లో వెల్లడయ్యింది. పేస్ బుక్, ట్విట్టర్ కూడా శరవేగంగా విస్తరిస్తున్నాయి.

 View image on Twitter

 ఇంటర్నెట్ విస్తరిస్తోన్న తరుణంలోనే తెలంగాణా ఉద్యమాన్నినడిపి  దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా కేసీఆర్ చాలామందికి తెలుసు. కానీ మొదట మీడియా, సోషల్ మీడియా తెలంగాణా వాదాన్ని ఒక వేర్పాటు వాటంగానే భావించింది. తెలంగాణా వాదులంటే కొంత చిన్న చూపు మీడియాలోనే కాదు ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో ఇతరత్రా సంస్థల్లోనూ కనిపించేది. ఎక్కడికి వెళ్లినా ఎందుకు ఆంధ్రాను ముక్కలు చేస్తున్నారు అని అడిగే వారు. అది మారిపోయింది. ఇప్పుడు గడిచిన ఐదేళ్ళలో ఒక్క  ఢిల్లీ లోనే కాదు దేశవ్యాప్తంగా అందరికీ తెలంగాణా అంటే ఏమిటో తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణా తెలుగువాళ్ళకు ఒక కొత్త అస్థిత్వమయ్యింది. దీనికి గడిచిన ఐదేళ్ల పాలన మాత్రమే కారణం అంటే  అతిశయోక్తి కాదు. తెలంగాణా అంటే ఒక పురోగామి  రాష్ట్రమని, పెట్టుబడులకు భద్రత ఉన్న రాష్ట్రమని అంతే కాకుండా హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరమని దేశమంతటికీ అర్థమయి పోయింది.

కేసీఆర్ ను నెటిజన్లు ఇష్టపడడానికి మొదటి కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయనకున్న విజన్. గత ఐదేళ్లకాలంలో దానివల్ల సాధించిన ప్రగతి. అలాగే హైదరాబాద్ లో ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు గణనీయమైన ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడి పాలనను చూస్తున్నారు. ప్రగతిని గమనిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అంటే తెలియని వాళ్ళు లేరు. వీరిలో ఎక్కువ మందికి కేసీఆర్ కంటే కేటీఆర్ ఎక్కువ తెలుసు. పైగా కేసీఆర్ ఒకటి రెండు సందర్భాలలో తప్ప జాతీయ మీడియాతో పెద్దగా మాట్లాడింది లేదు. అందుకే చాలామంది ఆయన భాష గురించి కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఇంగ్లీష్ భాషను మెచ్చుకున్నారు, ఆయన హిందీ ని చూసి ఆశ్చర్య పోయారు. ఇంత బాగా రెండు భాషలు మాట్లాడడమే కాదు, ఆయనలో అనేక ఆధునిక భావాలున్నాయని గమనించి పోస్టులు పెట్టారు. ఆయన అరగంట అనర్గళంగా దేశం గురించి చెపుతూ ఒక్క సారికూడా మతం గురించి, కులం గురించి ప్రస్తావించలేదని అది తమకు నచ్చిందని కామెంట్ చేశారు. ఆధునిక ప్రజాస్వామ్య ధోరణి చాలామందికి నచ్చుతుంది. ఇప్పటి తరం నేను, నాది అంటే ఇష్టపడదు. మనది అనాలి, మనం అనాలి. నాయకుడు మాట్లాడితే వినేవాళ్లకు ఇతను మనవాడు అనిపించాలి. సరిగ్గా కేసీఆర్ అలాగే మాట్లాడాడు. ఇంటర్వ్యూలో పదేపదే ప్రధాని పదవి గురించి ప్రస్తావన వచ్చినా కేసీఆర్ తొందరపడలేదు, ప్రధాని పదవికి నాయకుడు  ఎవరు అంటే నేనే అనలేదు.  'అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తప్పక వస్తారు' అన్నారు. నాయకత్వానికి దేశంలో కొదువ లేదు అన్నారు. 'నాయకుడి నుంచి ఫ్రంట్ రాదు, ఫ్రంట్ నాయకుడిని, వెతుక్కుంటుంది, దేశానికి అవసరం అయినప్పుడు అందిస్తుంది అన్నారు. మీరే ప్రత్యామ్నాయమా అంటే నేను కావాలని లేదు నా అజెండా ప్రత్యామ్నాయం కావాలి అన్నారు. స్థిత ప్రజ్ఞత నెటిజన్లకు నచ్చినట్టు కనిపించింది.
 View image on Twitter
మరో అంశం కేసీఆర్ కు దేశం పట్ల, ప్రపంచ పాలన వ్యవస్థల పట్ల ఉన్న అవగాహన నెటిజన్లకు చాలా నచ్చింది. దేశం కాంగ్రెస్, బీజేపీ పాలనలో నలిగిపోయిందని చాలామంది నెటిజన్లు కూడా భావిస్తున్నారు. దానిని కేసీఆర్ మరింత విడమరచి వారికి ఎలా అభివృద్ధి చేయాలో తెలియక ఎలా విఫలం అయ్యారో చెప్పడం నచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ కు విజన్ లేక పోవడం ఆలాగే పూర్తి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా మోడీ కలిసి వచ్చిన ఒక సదవకాశాన్నిఎలా  వినియోగించుకోలేక పోయాడో కేసీఆర్ విశ్లేషించారు. అలాగే మనకంటే పేదదేశాలు,  సహజ వనరులు లేని దేశాలు, ముఖ్యంగా మనచుట్టూ ఉన్న చైనా, సింగపూర్ ఇతర ఆసియ దేశాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆయన సోదాహారణంగా వివరించడం చాలామందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా దేశంలో ఎన్ని నీళ్లు వృధాపోతున్నాయి, వాటిని ఎలా వాడుకోవాలి, ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది, మరోవైపు విద్యుత్ లేకుండా దేశంలో అనేక  ఎందుకు  చీకట్లో ఉన్నాయి  కూడా పరిష్కరించడంలో ఎలా విఫలమయ్యారో  వివరించడం నచ్చింది. అలాగే దేశంలో ఉన్న యువశక్తికూడా నిర్వీర్యం అవుతోందని, ఎందుకు వినియోగించుకోలేక పోతున్నామని  అత్యంత కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. అది చాలా మందిని ఆలోచింప జేసింది.

ఇక మూడవది, ముఖ్యమైనది ఆయన ప్రతిపాదిస్తున్న ఫెడరల్ అజెండా, అది ఫ్రంటా, బ్యాకా అని వెటకారాలు రాసే తెలుగు మీడియాకు భిన్నంగా ఇంటర్వ్యూ కేసీఆర్ తన మనసులో ఏముందో ఆవిష్కరించే అవకాశం ఇచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ అంటే కేవలం గొర్రెల మంద కాదు, కాపరి ఆలోచన, దృక్పథం అని చెప్పగలిగారు. ప్రజాస్వామ్యంలో పెద్దపార్టీలు, జాతీయ పార్టీల పేరుతో రెండు పార్టీలే అధికారం ఎందుకు చెలాయించాలి? దేశంలో విడివిడిగా పోటీచేసి దాదాపు పార్లమెంటులో 40 నుంచి 50 శాతం  స్థానాలు గెలుస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక జట్టుగా ఉంటే   జట్టే అధికారంలోకి వస్తుందన్నది కేసీఆర్ ఆలోచన. ఒకవేళ జట్టుకు బలం చాలక పోయినా కాంగ్రెస్ బీజేపీ లలో ఎవరో ఒకరు వారికే సహకరించవచ్చు కదా అన్నది ఆయన అభిప్రాయం. ఇలా చేయడంవల్ల రాజ్యాంగ లక్షణాల్లో ఒకటైన ఫెడరల్ స్ఫూర్తికి బలం చేకూరుతుంది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నిలబడుతుంది, స్వతంత్రత పెరుగుతుంది, కేంద్ర ఆధిపత్యం తగ్గుతుంది. తమ ప్రణాళికలు తాము చేసుకుని స్థానిక ప్రాధాన్యతలను బట్టి పాలనా విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నారు కేసీఆర్. ఇవన్నే ఈయనకు ఎలా తెలుసు అని కొందరు ఆశ్చర్య పోతున్నారు. అవినిజమేనా అని గూగుల్ లో వెతుక్కుంటున్నారు. ఆయన అవగాహనకు, ఆలోచనకు, ఆచరణాత్మక ప్రణాళికకు ముగ్దులవుతున్నారు, ముచ్చట పడుతున్నారు. వేలాదిమంది నీరాజనాలు పలుకుతూ కామెంట్లు పెడుతున్నారు, చేతులెత్తి నమస్కరిస్తున్నారు. జాతీయ రాజకీయ వేదిక మీదికి జై కొట్టి మరీ స్వాగతిస్తున్నారు

బందా బిందాస్ హై !

అన్నీ పాజిటివ్ కామెంట్లే రావడం గమనించిన గౌస్ షేక్ అనే నెటిజెన్ ''ఎవరైనా కేసీఆర్ ను విమర్శించేవాళ్లు దొరుకుతారేమోనని వెతికి విఫలమయ్యాను" అని రాశారు. " కాలంలో విమర్శే  లేకపోవడ అరుదు" అని రాశాడు. అలాగే అభిషేక్ ఖత్రి అనే మరో వ్యక్తి " బందా బిందాస్ హై !అని రాశాడు. అంటే This man is bold అని అర్థం. ఇప్పుడు దేశానికి కావాల్సిది  బోల్డ్ గా ఉండే వాళ్ళేనిజానికి కేసీఆర్ మనసులో ఉన్నది అతి పెద్ద అజెండా ఆయన ఇంకా మూట విప్పలేదు. ఇప్పుడు వచ్చింది కేవలం ట్రైలర్ మాత్రమే! చెప్పాల్సింది ఇంకా వుంది!!

 



Comments

Popular posts from this blog

తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం

ప్రొ. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం !!