ఫెడరల్ ఫ్రంట్: తక్షణ కర్తవ్యం!
రాష్ట్రాల ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ తక్షణ కర్తవ్యాలు, కార్యాచరణ పై పరిశోధకుడు, రాజకీయ విశ్లేషకుడు డా. రాహుల్ రాజారామ్ రాసిన వ్యాసాల్లో ఇది మూడవది. 16 ఏప్రిల్ 2017 నమస్తే తెలంగాణా పత్రికలో అచ్చయిని ఈ వ్యాసం చర్చ్ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. - నీలమేఘం సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మొదటిదశ తో పాటు తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఆదర్శవంతమైన రీతిలో పూర్తయ్యింది. చాలా రోజుల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) తనదైన శైలిలో సమీక్షలు చేస్తున్నారు, అసెంబ్లీ కి ఎన్నికలు పూర్తయి రెండవ దశ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసాక పార్లమెంట్ ఎన్నికల మూలంగా ఆయన పాలన మీద పెద్దగా దృష్టి పెట్టనప్పటికీ ఈసారి పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులుంటాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేసి జూన్ నుంచి తెలంగాణలో సమూలమార్పులు జరుగబోతున్నాయన్న చర్చ సర్వత్రా మొదలయ్యింది. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ఫెడరల్ ఫ్రంట్ మీద కూడా చర్చ మొదలయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర