ప్రొ. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం !!

డాక్టర్ రాహుల్ రాజారామ్ తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జాక్) లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రెడ్డి రాజకీయ నాయకత్వ వైఫల్యంపై డా. రాహుల్ రాజారామ్ చేసిన విశ్లేషణ ఇది. ఇందులో కొంతభాగం మార్చ్ 1న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కారణాలు తెలియదుగానీ ఆంధ్రజ్యోతి పూర్తిగా ప్రచురించలేక పోయింది, వ్యాసంలో కీలకమైన అంశాలు ఉన్నందునపూర్తి వ్యాసాన్ని రచయిత అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం - నీలమేఘం ప్ర త్యేక తెలంగాణకోసం అకుంఠిత దీక్షతో ఒక దశాబ్ద కాలానికి పైగా రాజీ లేని పోరాటం చేసి నిలబడిన ఉపాధ్యాయుడు, పైగా ఉద్యమ కాలంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె సి ఆర్ కు ఆత్మగా మెలిగిన ప్రో. కోదండరామ్ తో ప్రభుత్వం వ్యవరించిన తీరు చాలామంది తెలంగాణా వాదులను,ముఖ్యంగా మేధోవర్గాలు, విద్యావంతులను విస్మయానికి గురిచేసింది. శత్రువు కూడా వ్యవహరించని రీతిలో ఆయనను అరెస్ట్ చేయడం ఆందోళనకు గురిచేసింది. సహజంగానే ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాల...