ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కోటా కోరాలి ..!
తె లంగాణ ప్రభుత్వం ప్రయివేట్ యూనివర్సిటీల పై వెనక్కు తగ్గినట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. నిజమే అయితే నిజంగానే ఇదొక శుభవార్త. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును అనుమతించాలని ప్రభుత్వం పై ఒత్తిడి ఉంది. గత ఏడాది కాలంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అంతే కాకుండా ముఖేష్ అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు విద్యారంగంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ వ్యాపారానికి తెలంగాణా అనువైన ప్రాంతమని భావించి, హైద్రాబాద్ పరిసరాల్లో కేజీ నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలో కొందరితో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోతెలంగాణా ఉన్నత విద్యాశాఖ ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ముసాయిదాను ఇటీవలి కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి కూడా అయిన కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఉపసంఘం ప్రస్తుతం జరుగుతున్...